గిగ్ వర్కర్లకు హెల్మెట్ల పంపిణీ

19-09-2026 | 01:14pm

పటాన్‌చెరు, సెప్టెంబర్ 19: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల(gig workers)కు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.



మరిన్ని వార్తలు