సింపుల్‌గా ఉప్పు శెనగల తయారీ

30-09-2026 | 12:57pm

సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉప్పు శెనగల(Salted chickpeas)ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పాన్‌లో ఉప్పు వేసి హై ఫ్లేమ్‌పై బాగా వేడి చేయాలి. ఉప్పు వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టిన శెనగలను అందులో వేసి గరిటెతో నిరంతరం కలుపుతూ కరకరలాడే వరకు వేయించాలి.

 శెనగలు బాగా వేగిన తర్వాత వాటిని జల్లెడలో వేసి ఉప్పును వేరు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఉప్పు శెనగలు రుచికరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి. శెనగల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియకు, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా తోడ్పడవచ్చని భావిస్తున్నారు.అయితే ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉప్పు పరిమాణాన్ని మితంగా ఉపయోగించడం మంచిది.

మరిన్ని వార్తలు