22 -ఏ సమస్యలపై హైలెవల్ కమిటీ
ఎల్‌బీనగర్‌లో నేటి నుంచి ప్లాట్ల రెగ్యులరైజేషన్
జీవో 118 ప్రకారం 9,700 ప్లాట్లకు అవకాశం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేసిన ప్రకటనకు అనుగుణంగా 22 -ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీ(High-level committee) ఏర్పాటు చేసినట్లు శుక్రవారం శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీఓ నెం. 564ను జారీచేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్‌ఏ డీఎస్ లోకేష్‌కుమార్(CCLA DS Lokesh Kumar), లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్(Stamps and Registration) ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఇచ్చిన హామీ మేరకు రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 118 జీఓ ప్రకారం 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన మెమోను జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ జీఓ ప్రకారం ఆ ప్రాంతంలో శనివారం నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, ఇది ని రంతర ప్రక్రియ అని తెలిపారు. దశాబ్దాల కాలంగా అక్కడ ప్లాట్లు తీసుకొని నివాసం ఉంటున్న ఇండ్ల యజమానులు 118 జీఓ ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు.
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్(Regularization of house sites)కు సంబంధించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) హ యాంలో జీవో 76ను జారీ చేశారని, ఆ జీవోను అనుసరించి డిప్యూటీ సిఎం భట్టి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.
అలాగే రెవెన్యూ రికార్డుల లో 22 ఏలో ఉండి హెచ్‌ఎండీఏ, డీటీపీపీ, జీహెచ్‌ఎంసీ అనుమతుల తో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22 ఏ నుంచి తొలగించే విషయంలో ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రక టించిన 10--12 అంశాలపై నెలరోజుల వ్య వధిలో నిర్ణయం తీసుకొని దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని తెలిపారు.