పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన పేరును పరిశీలించాలి
మంత్రి ఉత్తమ్ కు వినతి పత్రం ఇచ్చిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టికూటి రామారావు గౌడ్
నేరేడుచర్ల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తన పేరును పరిశీలించాలని రాష్ట్ర పౌరసరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని కలిసి బయోడేటా ఇచ్చి, తనకు అవకాశం కల్పించమన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ విజ్ఞప్తి చేశారు.
గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన డాక్టర్ వట్టి కూటి రామారావు గౌడ్ గత మూడు దశాబ్దాలుగా విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా జైలుకు వెళ్లి, అనేక కేసులు ఎదుర్కొన్నాను.
ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టివి9లలో జర్నలిస్టు గా, హైకోర్టు న్యాయవాదిగా, సుప్రీంకోర్టు ఎన్ రోల్డ్ అడ్వకేట్ గా పనిచేశారు. అనేక సామాజిక, వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలక పోరాటాలు సైతం చేశారు. జై గౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షులుగా పని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇవ్వగలరని మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్ తదితరులు ఉన్నారు.