అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- జర్నలిస్టులకు గృహనిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి
హుజూర్‌నగర్: పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట(Phanigiri Ramaswamy Gutta) వద్ద గత ప్రభుత్వ హాయంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు పొజిషన్ ఇచ్చి గృహనిర్మాణ పథకం(Journalists housing scheme) ద్వారా రూ 5 లక్షల నిధుల కేటాయింపు చేయాలని కోరుతూ తహసిల్దార్ బండా కవిత మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్(Municipal Chairman Dontagani Srinivas) కమిషనర్ కే సతీష్ లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ... ఎటువంటి జీతభత్యాలు లేకుండా ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్లస్థలాల సమస్యలపై రాష్ట్ర నీటి పారుదల,ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని కలుస్తామని తెలిపారు.