27 August, 2026 | 7:19 PM

మొగిలిపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

27-08-2026 05:16 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన పల్లెపూ పుష్ప–సురేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో గురువారం గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోందని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు విజయ్, దేవదాస్, సాయిలు, రమేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలేటి జలపతి రెడ్డి, నైనేని రాజేందర్, ఎలేటి రాజారెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.