6 September, 2026 | 12:19 AM

మంచిర్యాలలో వెయ్యి రోజుల ప్రజా పాలన సంబరాలు

05-09-2026 | 10:49pm

- భారీ మోటారు సైకిల్ ర్యాలీ

మంచిర్యాల  టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావుతో(MLA Prem Sagar Rao) కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ(bike rally) బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా నుంచి నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు నిర్వహించారు.

ఈ బైక్ ర్యాలీలో మంచిర్యాల(Mancherial District) ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్లేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, మైనారిటీ, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు