కమలినికి భారీ నజరానా

23-09-2026 | 05:05am

75 లక్షల నగదు పురస్కారం.. తమిళనాడు సీఎం విజయ్ ప్రకటన

చెన్నై, సెప్టెంబర్ 22: ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం(Indian women's cricket team gold medal) గెలుచుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్ జి. కమలినికి(Gunalan Kamalini) తమిళనాడు ప్రభుత్వం(Government of Tamil Nadu) భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. మదురైకి చెందిన కమలిని భారత జట్టులో సభ్యురాలిగా ఉండటంపై సీఎం విజయ్ ప్ర త్యేకంగా అభినందనలు తెలిపారు.

20వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం అందుకున్న భా రత మహిళల క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఈ జట్టులో సభ్యురాలిగా ఉన్న ప్లేయర్ కమలినిపై ప్రశంసలు కురిపించారు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించాలని నిర్ణయించామన్నారు. కమలిని వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. ఆమె విజయం రాష్ట్రంలోని యువత, మహిళలకు ఎంతో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని సీఎం విజయ్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు