6 September, 2026 | 12:20 AM

భార్యను హతమార్చిన భర్త అరెస్టు

05-09-2026 | 10:45pm

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నంద్యాల మండలంలో అనుమానంతో భార్యను హతమార్చిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్ నిందితుని అరెస్టు వివరాలను వెల్లడించారు. నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల గ్రామంలో ఈ నెల 02 న తోట సబిత ను  హత్య కేసులో నిందితుడు భర్త తోట మల్లేష్‌ను నెన్నెల పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో నిందితుడు ఆమెను తరచూ వేధిస్తూ, గొడవపడేవాడని, గతంలో కూడా ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందనీ తెలిపారు.

02 న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో నిందితుడు సబిత గొంతు నులిమి,అనంతరం ఇంట్లో లభించిన పదునైన వస్తువుతో ఆమె గొంతుపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలి,దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం తగిన సమాచారం మేరకు తాళ్లగురజాల వై-జంక్షన్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ సి.హెచ్. హనూక్ ప్రశంసించారు.

మరిన్ని వార్తలు