25 April, 2026 | 3:21 AM

హైదరాబాద్‌లో తొలి ప్రత్యేక కౌట్యూర్ స్టోర్

25-04-2026 01:38 AM
  1. ప్రారంభించిన యువ ఫ్యాషన్ డిజైనర్ అమూఘ్ రెడ్డి
  2. కార్యక్రమంలో ఆకట్టుకన్న ప్రత్యేక ఫ్యాషన్ వాక్

హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): అమూఘ్ రెడ్డి, భారతదేశంలోని అత్యంత యువ కౌట్యూర్ డిజైనర్లలో ఒకరైన అమూఘ్ రెడ్డి, హైదరాబాద్‌లోని కాజా గూడ టెక్ రిడ్జ్ సర్కిల్, లాంకో హిల్స్ రో డ్డులో తన తొలి ప్రత్యేక స్టోర్ అమూఘ్ రెడ్డి బ్రైడల్ ప్రెట్ కౌట్యూర్‌ను గురువారం సా యంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం ఆధునిక భారతీయ కౌ ట్యూర్ ఫ్యాషన్‌ను సస్టైనబిలిటీ, నైపుణ్యం,  సృజనాత్మకతతో కొత్తదిశగా తీసుకెళ్తున్న యువ డిజైనర్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ప్రారంభో త్సవం అనంతరం నిర్వహించిన ప్రత్యేక ఫ్యాషన్ వాక్ కార్యక్రమంలో ప్రొఫెషనల్ మోడల్స్ పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్తగా ప్రారంభించిన ఈ స్టోర్‌లో బ్రైడల్ కౌట్యూర్, ప్రెట్ కలెక్షన్స్, సమకాలీన ఫ్యాషన్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ భారతీయ అందాలను ఆధునిక శైలితో మేళవిస్తూ రూపొం దించిన ఈ కలెక్షన్స్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిం చే ప్రత్యేకమైన ఫ్యాషన్‌ను కోరుకునే వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

డిజైనర్ అమూఘ్ రెడ్డి కస్టమ్ ఫ్యాషన్ రంగంలో సృజనాత్మకతతో పాటు ప్రతి దుస్తుల రూపకల్పనలో అత్యంత సూక్ష్మమైన శ్రద్ధను పా టించే ప్రత్యేకవిధానానికి గుర్తింపు పొందా రు. ప్రతి డిజైన్ సీజన్, సందర్భం, దుస్తులు ధరించే వ్యక్తి వ్యక్తిత్వానికి అనుగుణంగా ఎం పిక చేసిన ఫ్యాబ్రిక్స్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రత్యేక రంగులు, వినూత్న డిజై న్లు,సున్నితమైన హ్యాండ్‌వర్క్ ద్వారా ప్రతి దుస్తుకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తారు.

డిజైన్ ప్రక్రియ పూర్తున తర్వాత ప్రతి దుస్తిని అత్యంత ఖచ్చితత్వంతో స్టిచింగ్ చేసి, ఎలిగెన్స్, ప్రత్యేకత, కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందిస్తారు. సృజనాత్మకత, వ్యక్తిగతీకరణను సమన్వ యం చేస్తూ, ధరించే దుస్తులకే కాకుండా ఒక ప్రత్యేక అనుభూతిని అందిం చే ఫ్యాషన్‌ను అమూఘ్ రెడ్డి అందిస్తున్నా రు. ఈ సందర్భంగా అమూఘ్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ స్టోర్ ప్రారంభం నా కల సా కారమైన క్షణం.

ఫ్యాషన్ అనేది కేవలం దు స్తులు కాకుండా భావాలను, వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే ఒక కళారూపం కావాలని నేను నమ్ముతాను. భార తీయ కళాసంప్రదాయాలను ఆధునిక శైలి లో ప్రజలకు అందించాలనేది నా లక్ష్యం. ఫ్యాషన్ అందంగా కనిపించడమే కాకుండా భావోద్వేగాలను కూడా మోసుకెళ్లాలి అని అన్నారు.హైదరాబాద్‌కు చెందిన అమూఘ్ రెడ్డి కేవలం 15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి, వెడ్డింగ్, సంప్రదాయ కౌట్యూర్ డిజైన్లలో తన వినూత్న ఆలోచనలతో గుర్తింపు పొందారు.

భారతదేశంలోని అత్యంత యువ ఫ్యాషన్ ప్రతిభ ల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఫ్యాషన్ శైలుల తో సమన్వయంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ  కార్యక్రమానికి ఫ్యాషన్ ప్రేమి కులు, డిజైనర్లు, సోషల్ ప్రముఖులు, ఆహ్వానిత అతిథులు హాజరై, సంప్రదాయం, ఫ్యాషన్‌పై అమూఘ్‌రెడ్డి చూపిస్తున్న దృష్టిని అభినందించారు.