షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ఏం జరుగుతోంది?

03-10-2026 | 09:59am

హైదరాబాద్‌(Hyderabad)లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై నుంచి రైన్ వాటర్ వెంట్ పైపు(Rainwater Vent Pipe) ఒక్కసారిగా ఊడిపోయి.. రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌పై పడింది. దీంతో స్కూటర్‌ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అదృష్టవశాత్తూ బైకర్‌ హెల్మెట్(Helmet) ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. హెల్మెట్ లేకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని.. ఘటనను చూసిన వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

పైపు ఒక్కసారిగా ఊడిపడటంతో షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై(Shahkept Flyover) ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఫ్లైఓవర్‌పై ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు