కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమిషనర్

08-09-2026 | 10:16pm

కొడిమ్యాల(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి(Kondagattu Anjaneya Swamy)ని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్(Hydra Commissioner A.V. Ranganath) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనా రెడ్డి  పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం,పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం  రంగనాథ్ కు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేసి అర్చకులచే ఆశీర్వచనం ఇవ్వబడినది. 

ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్పి పురుషోత్తం రెడ్డి,మల్యాల సిఐ రాజ్ కుమార్, మల్యాల ఎస్ఐ సందీప్ కుమార్, కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్,ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు రంజీవస్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్ కుమార్,పరిశీలకులు  అశోక్,సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు