నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా
- స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు
- ఎమ్మెల్సీ తాతా మధు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారని, నేను మాట్లాడిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(Thatha Madhu) స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడలేదని, అలాంటి కుసంస్కారం తనకు లేదని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ గేటు(Assembly gate) వద్ద తనపై హత్యాయత్నం చేసిన కొందరిని, తమ పట్ల దురుసుగా వ్యవహరించిన వారిని ఉద్దేశించి మాత్రమే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్(Congress Government Diversionary Politics)కు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసులు(Police) నా డొక్కలో పిడిగుద్దులు గుద్దారని, అసహనంతో నేను అనని మాటలను స్పీకర్‌కు ఆపాదించారని తెలిపారు. తనపై దాడి చేసి ప్యాంటు ఊడదీయడానికి ప్రయత్నించారని, చెప్పడానికి వీలుకాని రీతిలో బూతులు తిట్టారని తెలిపారు. మిగిలిన విషయాలు మంగళవారం కౌన్సిల్‌లో మాట్లాడుతానని చెప్పారు.