ఇంప్యూర్ హిట్ కావాలి
వారాహి మల్లిపాముల(Varahi Mallipamula), శ్రీదేవి మల్లిపాముల(Sridevi Mallipamula) నిర్మించిన చిత్రం ‘ఇంప్యూర్(Impure)’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్ర ల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఇదే వేదికపై ట్రైలర్, ఓ పాట ను సైతం లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ నందినిరెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. “ప్రతీ తెలుగు వాళ్లకు ఒక సినిమా చేయాలని డ్రీమ్ ఉంటుంది.
తమ కూతురు నిశాంతి ఇవని డ్రీమ్ నెరవేర్చినందుకు శ్రీదేవి అభినందనీయులు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే మనం ఏదై నా సాధించగలం. ఈ సినిమా మంచి హిట్టవ్వాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నా” అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అని హీరో సాయికృష్ణ చెప్పారు. హీరోయిన్ యష్న మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను సంధ్య పాత్రలో నటించా. నా క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుంది” అని తెలిపింది.
డైరెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. “ఒక మనిషి ప్యూర్‌గా ఉండాలా? ఇంప్యూర్గా ఉండా లా? అనేది సొసైటి డిసైడ్ చేస్తుంది. వారా హి వచ్చి కథ నాకు చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక పెళ్లి క్యాన్సల్ అవడం వల్ల ముగ్గురి పరిస్థితి ఎలా మారిందనేదే ఈ సినిమా కథ. సంధ్య, ప్రణవ్, ధీర ముగ్గురి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ఇంప్యూర్’ సినిమా అందరకీ నచ్చుతుంది” అని చెప్పారు. ‘ఇంప్యూర్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత రామ్కీ తెలిపారు.