24 August, 2026 | 2:42 AM

నిర్వాసితులకు నష్టం జరగనివ్వను..

24-08-2026 12:12 AM

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, ఆగస్టు 23 : రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు నష్టం జరగనివ్వనని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హామీ ఇచ్చారు. సాహెబ్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణలో పేదలు ఇల్లు కోల్పోకుండా సీఎంతోపాటు ఉన్నతాధికాలతో నూ మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  మల్ రెడ్డి రామ్ రెడ్డి, సీనియర్ నేత  ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తో కలిసి మధుయాష్కీ ఆదివారం ఉదయం సాహెబ్ నగర్ ఓల్ విలేజ్  లో పర్యటించారు. 

రోడ్డు  విస్తరణతో ఇల్లు కోల్పోతున్న బాధితులు, గ్రామస్తులతో కలిసి విస్తరణ చేపట్టనున్న రోడ్ల ను పరిశీలించారు. 80 అడుగుల మేర విస్తరణతో ఇళ్లు కోల్పోతున్నామని.. తాత ముత్తాతల నుంచి ఉన్న ఇల్లు  కోల్పోవాల్సి వస్తుందని, తమకు న్యాయం చేయాలని  కో రారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. హయత్ నగర్ లో పుట్టి పెరిగిన త నకు.. సాహెబ్ నగర్ గ్రామంతో, ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన ఇంటి ఆడపడుచులు ఇల్లు కోల్పోతే బాధ ఎలా ఉంటుందో తనకు కూడా అలాగే బాధ ఉంటుందన్నారు. నా వద్దకు వస్తానంటే వద్దని చెప్పానని.. నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని  చెప్పి ఇక ్కడికి వచ్చానన్నారు.

అధికారులు ఆఫీసుల్లో కూర్చొని నిర్ణయాలు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. పేదలు ఎవరూ ఇళ్లు కోల్పోకుండా  సీఎం గారితో మాట్లాడతానని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ 80 అడుగులు కాకుండా ప్రస్తుతం ఉన్న 40 అడుగులకు వెడల్పు తగ్గించి.. స్థానికుల ఆస్తులు పోకుండా కాపాడుతామన్నారు.  మల్ రెడ్డి రామ్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ మాట్లా డుతూ.. సాహెబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తా  నుంచి రెండు వైపు మార్గాల్లో రోడ్ల వెడల్పుతో స్థానికులు నష్టపోయే అవకాశం ఉన్నందునా మధుయాష్కీగౌడ్ సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తారని  భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, సీనియర్ నాయకులు మకుటం సదాశివుడు, డివిజన్ అధ్యక్షుడు రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.