నది గట్టు దాటితే వరద.. సముద్రం దాటితే ఉప్పెన.. సామాన్యుడు దాటితే..?!

13-09-2026 | 05:30am

విక్టరీ వెంకటేశ్, -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం; 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న .

ఈ మూవీ టీజర్ శనివారం విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాష ణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందీ టీజర్. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ఈ సినిమా ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరిస్తూనే, ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలతో అలరించనున్నారని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

‘నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు.. కానీ, సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనుకాడను..’, ‘నది గట్టు దాటితే వరద అంటారు.. సముద్రం దాటితే ఉప్పెన అంటారు.. అదే సామాన్యుడు దాటితే..?! బలమైన పదం స్ట్రాంగ్ సౌండొచ్చేది మీరు వెతకండి సార్..

దొరికినపుడు వాట్సాప్ చేయండి!!’ వంటి డైలాగ్స్ ఈ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. రవి కే చంద్రన్ డీవోపీగా పనిచేస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్‌గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు