ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అక్రమ అరెస్టులు కాదు.. ఎన్నికల హామీలు అమలు చేయాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకుల(opposition party leaders)పై అక్రమ అరెస్టులు చేయడం కాకుండా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్(MLC Tata Madhusudhan) స్వగృహంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తాతా మధుసూదన్ అక్రమ అరెస్టుకు నిరసనగా దశలవారీగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.