అక్రమ కట్టడాలను ఆపేదెవరు?
కోదాడ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్‌కు సిబ్బంది కొరత
అదనపు బాధ్యతతో తప్పని అవస్థలు
కోదాడ, సెప్టెంబర్ 30: కోదాడ మున్సిపాలిటీ(Kodad Municipality)లో టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బం దిపై అదనపు బాధ్యతలు మోపడంతో పట్టణంలో నిర్మాణాల పర్యవేక్షణ గాడి తప్పు తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద మున్సిపాలిటీగా విస్తరిస్తున్న కోదాడలో అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టాల్సిన సిబ్బందినే ఇతర విధులకు కేటాయించడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు అంటున్నారు.
ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ విభాగంలో నలుగురు సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో జూనియర్ అసిస్టెంట్కు వార్డు ఆఫీసర్ బాధ్యతలు అప్ప గించడంతో పాటు కొలతలు నిర్వహించే సి బ్బందికీ వార్డు డ్యూటీలు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో టౌన్ ప్లానింగ్కు సంబంధించిన సిస్టమ్ వర్క్తో పాటు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించే బా ధ్యతలు ప్రధానంగా బిల్డింగ్ ఇన్స్పెక్ట్ప పడుతున్నట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు
అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ కరువు!
టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బందికి ఇతర విధులు అప్పగించడం వల్ల భవన నిర్మాణాలకు అనుమతులు, నిర్మాణ నిబంధనల అమలు, క్షేత్రస్థాయి తనిఖీలు వంటి అంశాలపై పర్యవేక్షణ తగ్గుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ సోదాల తర్వాత పెరిగిన అక్రమ నిర్మాణాలు?
ఇటీవల సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారిని కోదాడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న స మయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత టౌన్ ప్లానింగ్ వ్యవహా రాలపై మరింత చర్చ జరుగుతోంది. ఇదే స మయంలో పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అ వసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. టౌ న్ ప్లానింగ్ విభాగానికి సరిపడా సిబ్బందిని కేటాయించి, ఇతర శాఖల విధుల నుం చి మినహాయించి నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం
టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరతను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు హుజూర్నగర్లో పనిచేస్తున్న అధికారిని డిప్యుటేష్ప కోదాడకు పంపుతున్నారు. విధుల్లో చేరగానే పరిశీలన చేసి అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటాం.
రమాదేవి, కమిషనర్,
కోదాడ మున్సిపాలిటీ