మద్యం విక్రయాలపై స్థానికుల ధర్నా

04-10-2026 | 06:07pm

సాయంత్రమైతే మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటే భయం

కోదాడ అక్టోబర్ 4(విజయక్రాంతి) : పేదల కోసం నిర్మించిన బాలాజీనగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల(Double-bedroom houses) వద్ద మద్యం విక్రయాలపై(Liquor sales) తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పరిసరాల్లో కొంతమంది డబ్బా కొట్లు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతంలోనే మద్యం విక్రయాలు సాగుతుండటంతో మహిళలు, చిన్నారులు, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ వాసులు ఆదివారం ధర్నా నిర్వహించారు.

శ్రీనివాస్‌, శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.పనులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు తిరిగి వచ్చే సమయంలో డబ్బా కొట్ల వద్ద మద్యం సేవించే వారు గుమిగూడుతున్నారని స్థానికులు ఆరోపించారు. దీంతో మహిళలు, చిన్నారులు ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ కార్యక్రమంలో కంభంపాటి ప్రమీల, షేక్ రంజాన్ బి, వేల్పుల నవాంజి, బానోతు చిట్టి, శ్రీరాములు సరిత ,ఎం చంద్రకళ, శ్రీవాణి ,దుర్గాబాయ్, ఓంకారం వీరమ్మ, ఎం భద్ర, సంధ్య, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు