భారత్ బీభత్సం! పాక్‌కు భారీ టార్గెట్

03-10-2026 | 11:58am

ఆసియా క్రీడలు 2026: భారత్–పాకిస్థాన్( IND vs PAK Final 2026) మధ్య జరుగుతున్న గోల్డ్ మెడల్ ఫైనల్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211( India 211/6) పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత ఇన్నింగ్స్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ 61 పరుగులతో మెరుపు ఆరంభం అందించాడు. పాకిస్థాన్ బౌలర్లపై దూకుడుగా ఆడిన అతడు వేగంగా పరుగులు రాబట్టి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. అనంతరం కీలక దశలో తిలక్ వర్మ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత ఇన్నింగ్స్‌కు బలమైన ముగింపు ఇచ్చాడు. మధ్యలో భారత టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయినప్పటికీ.. తిలక్ వర్మతో(Tilak Varma) పాటు శివం దూబె భారత స్కోరును 200 మార్క్ దాటించారు. చివరి ఓవర్లలో వచ్చిన పరుగులతో టీమిండియా 211/6కు చేరుకుంది. దీంతో గోల్డ్ మెడల్ కోసం బరిలోకి దిగనున్న పాకిస్థాన్‌కు 212 పరుగుల కఠినమైన లక్ష్యం ఎదురైంది.

అభిషేక్ శర్మ తుఫాన్

అభిషేక్ శర్మ తన 61 పరుగుల ఇన్నింగ్స్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్( IND vs PAK ) బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడి ఇన్నింగ్స్ భారత్‌కు పవర్‌ప్లేలోనే మంచి ఊపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల విషయంలో యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.

తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్

మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. చివరి వరకు నిలిచి 51 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. అతడికి చివరి దశలో శివం దూబె నుంచి మంచి సహకారం లభించింది. ఇక ఇప్పుడు అసలు పోరు మొదలైంది. 212 పరుగుల లక్ష్యంతో పాకిస్థాన్ ఛేజింగ్‌కు(Pakistan chasing) దిగనుంది. గోల్డ్ మెడల్ కోసం జరుగుతున్న ఈ హైఓల్టేజ్ ఫైనల్లో భారత బౌలర్లు ఈ భారీ లక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. భారత్–పాకిస్థాన్ మధ్య తొలిసారి ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్లో జరుగుతున్న ఈ పోరు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

మరిన్ని వార్తలు