భారత్‌కు ఘోర పరాభవం! 40 ఏళ్ల ఆశకు బ్రేక్
ఆసియా క్రీడలు 2026లో(Asian Games 2026) భారత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. పురుషుల వాలీబాల్ క్వార్టర్‌ఫైనల్లో(India vs Pakistan Volleyball) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాక్ 3-0తో(India vs Pakistan volleyball result) వరుస సెట్లలో భారత్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. భారత జట్టు మాత్రం మెడల్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత్-పాకిస్థాన్ వాలీబాల్ క్వార్టర్‌ఫైనల్ అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది.
ఆసియా క్రీడల్లో మెడల్‌పై ఆశలు పెట్టుకున్న భారత వాలీబాల్ జట్టుకు ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. మూడు సెట్లలోనూ పాకిస్థాన్ ఆధిపత్యం ప్రదర్శించడంతో భారత్‌కు మ్యాచ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే అవకాశం దక్కలేదు. దీంతో ఒక్క సెట్ కూడా గెలవకుండానే క్వార్టర్‌ఫైనల్(India Pakistan quarterfinal) దశలోనే భారత ప్రయాణం ముగిసింది. టోర్నీలో భారత్ అంతకుముందు అద్భుతంగా ఆడింది. పూల్ దశలో వరుస విజయాలు సాధించడంతో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఖతార్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో రెండు సెట్ల వెనుకబడ్డప్పటికీ భారత్ అద్భుతంగా పుంజుకుని 3-2తో విజయం సాధించింది. అంతకుముందు వియత్నాం, హాంకాంగ్‌లపై కూడా భారత్ వరుసగా 3-0 విజయాలు నమోదు చేసింది.
అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మొదటి నుంచే ఒత్తిడిలో కనిపించిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి దూకుడుకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. చివరకు వరుసగా మూడు సెట్లను కోల్పోవడంతో మ్యాచ్ పాక్ సొంతమైంది. ఈ ఓటమితో ఆసియా క్రీడల్లో(India Pakistan Volleyball Asian Games 2026) భారత పురుషుల వాలీబాల్ జట్టు మెడల్ సాధించే అవకాశం చేజారింది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో వాలీబాల్ పతకం సాధించాలన్న ఆశలకు ఈ పరాజయంతో బ్రేక్ పడింది. భారత్ చివరిసారిగా 1986 సియోల్ ఆసియా క్రీడల్లో వాలీబాల్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో హోరాహోరీగా సాగుతుందని భావించిన భారత్-పాకిస్థాన్ పోరు ఏకపక్షంగా ముగిసింది. పాక్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా.. భారత జట్టు మాత్రం మెడల్ లేకుండానే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.