రక్షణ రంగంలో మరో పెను సంచలనం

10-09-2026 | 10:09pm

ఆటోనామస్ యుద్ధ వ్యవస్థ తో డిఫెన్స్ టెక్ స్టార్ట్ అప్

ఇండియన్ ఆర్మీకి బ్యాటిల్ ఫీల్డ్ టెక్నాలజీ లో సరికొత్త వ్యవస్థ

బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల స్టార్టప్ బీజన్ టెక్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రముఖ విద్యా సంస్థ అయిన బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్(BITS Pilani Hyderabad Campus) విద్యార్థులు రక్షణ రంగంలో సరికొత్త ఆధ్యాయాణానికి తెర తీశారు. ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా మొదలైన ఆలోచన నేడు భారత సాయుధ దళాల(Indian Armed Forces) కోసం తెలివైన వ్యవస్థలను అభివృద్ధి చేసే డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ అప్ గా ఎదిగింది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నమన్ కస్లీ వాల్, శివ పాటిల్ సంయుక్తంగా బీజంటెక్ పేరుతో స్టార్టప్ ను స్థాపించారు. హైదరాబాదులోని బిట్స్ లోని కోరస్ ల్యాబ్ నుంచి కార్యాకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రతి యంత్రానికి ఒక మెదడు ఇవ్వడం అనే లక్ష్యంతో పని చేస్తుందని తెలిపారు. ఆధునిక రక్షణ ఆపరేషన్లలో నావిగేషన్ టార్గటింగ్ సమన్వయాన్ని మెరుగుపరిచే ఆటోనామస్ యుద్ధ సాంకేతికలను అభివృద్ధి చేస్తోంది.

మైలురాళ్లుగా ఇస్రో చాలెంజింగ్ నుంచి పోక్రాన్ వరకు:

మైలు రాళ్లుగా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్లో తక్కువ ఖర్చుతో కూడిన విజువల్ నావిగేషన్ పైప్ లైన్(Visual navigation pipeline)ను అభివృద్ధి చేసి ఫైనల్స్ కు చేరుకోవడంతో వీరి ప్రయాణం మొదలైంది. ఈ టెక్నాలజీ రక్షణ అధికారాలను దృష్టిని ఆకర్షించింది. దీంతో పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్(Pokhran Field Firing Range)లో ఆర్మీ డిజైన్ బ్యూరో కోసం డ్రోన్ స్మార్పు గ్రౌండ్ స్టేషను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష విజయవంతం అవ్వగా ఈ విజయవంతమైన ప్రయోగం వారికి అనేక ఆర్మీ యూనిట్లతో కలిసి పని చేసే చక్కని అవకాశాన్ని కల్పించింది. 

బిట్స్ ఆవిష్కరణల పర్వం: బీసెంట్ ప్రస్తుతం యుద్ద భూమిలోని పరికరాల మధ్య సురక్షితమైన మెస్ నెట్వర్క్ ద్వారా అనుసంధానం కల్పించే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది.   

1. బీజన్ ఆటోనామస్ నావిగేషన్ మోడ్యుల్: జిపిఎస్ లేని ప్రాంతంలో కూడా రోడ్లు నావిగేట్ అయ్యేలా చేసే చిన్న ఎడ్జ్ కంప్యూటర్ జిపిఎస్ జామింగును తట్టుకొని పనిచేసే ఈ టెక్నాలజీతో ఏ డ్రోన్ అయినా యాంటీ జాబులుగా మారుతుందని ప్రస్తుతం పీఎఫ్ ఎఫ్ ఆర్ సికింద్రాబాద్ లేహ తదితర ప్రాంతాలో ఈ పైలెట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయని తెలిపారు.

2. ఆటోనామస్ అర్టలరీ పొజిషనింగ్ సిస్టం: పాత ఫిరంగలను ఆధునికరించే వ్యవస్థ కంప్యూటర్ విజన్ ఆటోమేటెడ్ మోటార్ సిస్టంతో ఫిరంగలను త్వరగా మళ్ళించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. 

అందుకున్న గుర్తింపులు అవార్డులు: ఈ సంస్థ సాంకేతికతకు ఇప్పటికే ఆర్మీ నుంచి విశేషణ స్పందన లభించిందని ప్రపంచ స్పార్ను గ్రౌండ్ స్టేషన్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ లో మోహరించబడిందని ఎనిమిది మిలటరీ యూనిట్ల నుండి 20 లక్షల విలువైన ఎంవిపి ఆర్తలరి ఆటోమేషన్ ఆర్డర్ దక్కించుకుందని తెలిపారు. అలాగే కురియాసిటీ 2025 విజేతగా నిలిచి 25 లక్షల గ్రాంటును సొంతం చేసుకున్నారని తెలిపారు. బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు ఈ ఆవిష్కరణ దేశీయ రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో భారత విశ్వవిద్యాలయాల పాత్ర విశ్వవ్యాప్తంగా మైలురాయిగా దేశ గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు