డాక్టరేట్ అవార్డు గ్రహీత శివ కళ్యాణికి అభినందనలు

10-09-2026 | 11:00pm

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల(Kodad Mandal) పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కాలుతెరిపి పాపయ్య అంజమ్మ కుమార్తె డాక్టరేట్ అవార్డు(Doctorate Award) అందుకోవడం జరిగినది. గురువారం కౌలు రైతు సంఘం(Tenant Farmers Association) రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మాట్లాడుతూ... నిరుపేద కుటుంబానికి చెందిన కాలతెరిపి శివ కళ్యాణి కోదాడలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియాలో ఎం ఏ పి హెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ అవార్డును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన నిరుపేద బాలిక ముందు అత్యున్నతమైన శిఖరాలు అందుకోవాలని పుట్టిన ఈ గ్రామానికి ఆమె సేవలు అందించాలని శివ కళ్యాణిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామములో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలు అవరోదించాలని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి తులసమ్మ కన్నారెడ్డి గ్రామపంచాయతీ కార్యవర్గం సభ్యులు దేవాలయం వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగినది

మరిన్ని వార్తలు