వినాయక ఉత్సవాలు శాంతి యుతంగా జరుపుకోవాలి
కోహెడ ఎస్ఐ పుల్ల అభిలాష్
కోహెడ,(విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను(Vinayaka Navratri Celebrations) శాంతి యుతంగా నిర్వహించాలని.. ఎస్ఐ పుల్ల అభిలాష్(Koheda SI Pulla Abhilash) అన్నారు. గురువారం వినాయక మండపాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు(Fire Accident) జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా డీజేలు, లౌడ్స్పీకర్లను వినియోగించ వద్దన్నారు. నిమజ్జనం రోజు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో సోదరభావంతో నిర్వహించుకోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.