గల్ఫ్ మృతుడి అంతిమయాత్రలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
మల్లాపూర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): గల్ఫ్ దేశమైన ఖతార్‌లో(Qatar) ఇటీవల మృతి చెందిన కోరుట్ల నియోజకవర్గం(Korutla Constituency), మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన తలారి ముత్తన్న(Talari Muttanna) మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు(Senior State Congress Party leader Juvvadi Krishna Rao) నడికుడ గ్రామానికి చేరుకుని ముత్తన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ముత్తన్న అంతిమయాత్రలో జువ్వాడి కృష్ణారావు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముత్తన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జలపతి రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ ముద్దం రాజేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.