కేజీబీవీ, పీహెచ్‌సీ బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీ
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మహమ్మదాబాద్ మండల(Mohammedabad Mandal) స్పెషల్ ఆఫీసర్ శివానంద స్వామి బుధవారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalayas), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Center), ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల్లోని సౌకర్యాలు,నిర్వహణ, విద్యార్థినులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కేజీబీవీ,ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు,హాస్టల్ వసతులను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన,రుచికరమైన భోజనం అందించాలని సూచించారు.
కూరగాయలు,ఇతర ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తాజాగా, పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.విద్యార్థులకు మెరుగైన విద్య,ఆరోగ్య సేవలతో కూడిన వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో కలిసి శివానంద స్వామి సమిష్టి భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి,పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అం