యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని పరిశీలించిన

25-09-2026 | 04:32pm

 కలెక్టర్ అంకిత

ఇల్లెందు, (విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Young India Integrated School) నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను(Survey process) జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇల్లెందు నియోజకవర్గంలోని సర్వే నంబర్ 549/1లో ప్రతిపాదించిన 20 ఎకరాల స్థలంలో జరుగుతున్న సర్వేను పరిశీలించిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన భూమిపై కొంతమంది రైతులు అభ్యంతరాలు(Farmers objections) వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు సర్వే కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా స్థలాన్ని పరిశీలించి సర్వే పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు రెవెన్యూ రికార్డులు(Revenue records), సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వివరాలు, పాత నక్షాలు, పాస్బుక్లలు, భూభారతి రికార్డులను(Bhubharathi records) కలెక్టర్కు చూపించారు. రికార్డుల్లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి.. భూమి విస్తీర్ణం, సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు.

సర్వే ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పాత రికార్డులు, నక్షాలు, సంబంధిత భూ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రికార్డుల ఆధారంగా సరిహద్దులను గుర్తించి.. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

రైతుల పత్రాల పరిశీలన 

కాగా, కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న పాత పాస్బుక్లు, భూ సంబంధిత పత్రాలను కలెక్టర్కు చూపించారు. తాము గతంలో సదరు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ వచ్చామని, తమ భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని కోరారు. పాఠశాల నిర్మాణానికి భూమి అవసరమైతే నిబంధనల ప్రకారం తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. రైతులు సమర్పించిన పత్రాలతో పాటు అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్.. సర్వే నంబర్ 549/1లో అన్ని శాఖల సమన్వయంతో సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రికార్డుల ఆధారంగా వాస్తవ సరిహద్దులను నిర్ధారించి సమగ్ర నివేదికను సమర్పించాలని రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లెందు తహసీల్దార్ ఖాసిం, ఏడీ సర్వే శ్రీనివాస్, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు