టౌన్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ

22-09-2026 | 06:05pm

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా(DIG Amber Kishore Jha) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరు, వివిధ రికార్డులను పరిశీలించారు. సీఐ ప్రేమ్ కుమార్, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్‌పై ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో నేరాలు, శాంతిభద్రతల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న డీఐజీ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్‌లలో ఉన్నవారు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ సబ్‌డివిజన్ డీఎస్పీ, సీఐ ప్రేమ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు