అంతర్ జిల్లా ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్ట్

11-09-2026 | 10:40pm

ముగ్గురు అరెస్ట్, మరొకరు పరారు

30 కిలోల కాపరి వైరు, బైకు, రాడ్లు స్వాధీనం

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): అంతర్ జిల్లా ట్రాన్స్ఫార్మర్స్ కాయిల్స్ చోరీ(Inter district transformer coil theft) ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి అందులో ఉన్న రాగి కాపర్ వైర్ చేసి వాటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నా మూటను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23 ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లను చోరీ చేసినట్లు తెలిపారు.

కుటుంబానికి చెందిన అన్నదమ్ములే ముఠాల ఏర్పాటు జల్సాలు బెట్టింగ్ కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి, గుర్జకుంట, జంగంపల్లి, తదితర గ్రామంలో గత ఐదు నెలల క్రితం స్థానిక ట్రాన్స్కో ఏ ఈ జాదవ్ బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రైతుల పంట పొలాలలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో రాగి కాయిల్స్ చోరీ చేస్తున్న ముఠా ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహారాష్ట్ర  కు చెందిన బల్జీర్ సింగ్ చతుర్ సింగ్ టాక్, రూప్ సింగ్ టాక్, లకం చతుర్ సింగ్ టాక్, లను అరెస్టు చేసినట్లు మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

వారి వద్ద నుంచి యమ బైక్, మొబైల్ ఫోన్, తొమ్మిది అక్సా బ్లేడ్లు, మూడు రాడ్లు, 30 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో వీరు పాత నేరస్తులు అని తెలిపారు. జైలు జీవితం గడిపి వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. జల్సాల కు అలవాటు పడ్డ వీరు చోరీలకు పాల్పడడం వృత్తిగా పెట్టుకున్నారు. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పలుచోరీలకు పాల్పడినట్లు తెలిపారు. అంతర్ జిల్లా ముఠా ను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి డిఎస్పి మధుసూదన్, సీఐ సంతోష్ కుమార్, భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్, సిసిఎస్, పోలీస్ సిబ్బందికి క్యాష్ అవార్డును అందజేసినట్లు ఎస్పి తెలిపారు.

మరిన్ని వార్తలు