వినాయకుడి తొలిపూజకు సీఎంకు ఆహ్వానం
అందజేసిన ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్,సెప్టెంబర్ 11(విజయక్రాంతి): ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే బడా గణేష్ తొలిపూజ నిర్వహించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు.
ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వంపరంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు రాజ్‌కుమార్, మహేష్ యాదవ్ తోపాటు ఇతర ముఖ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.