జన విజ్ఞాన వేదిక సమావేశం
నిర్మల్ సెప్టెంబర్ 27 ( విజయక్రాంతి) : జన విజ్ఞాన వేదిక(Jana Vignana Vedika) నిర్మల్ జిల్లా అధ్వర్యంలో "శూన్య కర్బన ఉద్గారాలు" దినోత్సవం స్థానిక టి.ఎన్.జి.ఓ.భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రఫీక్(District President Shaik Rafiq) మాట్లాడుతూ ప్రజలు అనాలోచితంగా శిలాజ ఇందనాలను(Fossil fuels) విరివిగా ఉపయోగించటం వలన కర్బన ఉద్గారాలు(Carbon emissions) అత్యధికంగా విడుదలై వాతావరణం, భూమి వేడెక్కడం జరుగుతుందని ఫలితంగా వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి ఎలనినో లాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.
జీవ యోగ్యమైన ఏకైక గ్రహం భూమి, ఈ పరిస్థితిని కాపాడుకోవడానికి ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాలయినా సోలార్, పవన విద్యుత్ లను వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి గజపల్లి నర్సయ్య మాట్లాడుతూ కొలంబియా లోని శాంతామర్తలో జరిగిన వాతావరణ మార్పులు, శిలాజ ఇందనాల వినియోగం నివారణ, అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మలావత్ భిక్షపతి, గౌరవ అధ్యక్షులు కొండా రాములు, అనంత్ విశ్వేశ్వర్, అంకం గంగాధర్ , కోశాధికారి వట్టోలి ముత్తన్న, సాంస్కృతిక కార్యదర్శి అంబటి నారాయణ,చెకుముకి కన్వీనర్ గాజర్ల నారాయణ వర్మ, రాష్ట్ర కార్యదర్శి గజపల్లి నర్సయ్య, ఉపాధ్యక్షులు రావుల గంగన్న, కార్యదర్శులు ఆముదారి వెంకటరమణ, డి వెంకట రమణ , రమేష్ మొదలైన వారు పాల్గొన్నారు.