6 September, 2026 | 1:12 PM

తీవ్ర విషాదం: గుండెపోటుతో ఉన్నత విద్యాశాఖ మంత్రి కన్నుమూత

06-09-2026 | 10:15am

రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో(Jharkhand politics) తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి(Jharkhand Higher Education Minister) సుదివ్య కుమార్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సుదివ్య కుమార్(Sudivya Kumar Sonu dies) తన స్వస్థలమైన గిరిడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు చేరగా, ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) నాయకుడు, రెండుసార్లు గిరిడిహ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన 56 ఏళ్ల ఈయన, తన నివాసంలో అస్వస్థతకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ JMM శాసనసభ్యుడు పట్టణాభివృద్ధి, పర్యాటకం, కళలు & సంస్కృతి, అలాగే క్రీడలు & యువజన వ్యవహారాల శాఖల బాధ్యతలను కూడా నిర్వహించారు. ఆయనకు భార్య శ్వేత శర్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంత్రి సుదివ్య కుమార్ మృతిపై పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.


మరిన్ని వార్తలు