చరిత్ర సృష్టించిన జో రూట్

13-09-2026 | 05:35am

సచిన్ రికార్డు బ్రేక్ 

ఎడ్జ్‌బాస్టన్, సెప్టెంబర్ 12 : ఇంగ్లాండ్ కెప్టె న్ జో రూట్ (England captain Joe Root) మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బ్రేక్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇ న్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఎడ్జ్‌బాస్ట న్ టెస్టులో సున్నాకే ఓపెనర్లు ఔటైనా రూట్ పాకిస్థాన్ బౌలర్లను విసిగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టాడు.

కెరీర్‌లో 69వ టెస్టు ఫిఫ్టీతో అత డు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొ ట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు 68 టె స్టు ఫిఫ్టతో సచిన్ సరసన నిలిచిన అతడు.. యాభై రన్స్‌తో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్‌లో 68 ఫి ఫ్టీలు సాధించగా, రూట్ కేవలం 309 ఇన్నింగ్స్‌లోనే ఈ మార్కును దాటేశాడు.

ఈ ఇ న్నింగ్స్‌తో జో రూట్ మరో భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానం లో 1000 ప్లస్ టెస్టు పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. 

మరిన్ని వార్తలు