గట్టు మహేష్ బాబు కు"కళాబందు" బిరుదు ప్రధానం

27-09-2026 | 10:13pm

హనుమకొండ, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘం జాతీయ నాయకుడు గట్టు మహేష్ బాబుకు(Gattu Mahesh Babu) అత్యుత్తమ "కళాబంధు"బిరుదు వరించింది. శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి(Sri Shanti Krishna Seva Samiti) ఆధ్వర్యంలో ఆదివారం కాళోజి కళాక్షేత్రంలో(Kaloji Kalakshetram) నిర్వహించిన అంతర్జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవం(International Cultural Arts Festival) "కాకతీయ కళా వైభవం" పురస్కారాలలో గట్టు మహేష్ బాబు కి ఈ గౌరవం దక్కింది.

ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, సహస్ర మహోత్సవ సామ్రాట్ శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  1023 అంతర్జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవం తీర్ట నిర్వహించిన ఈ కార్యక్రమంలో గట్టు మహేష్ బాబు సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేసినట్లు నిర్వాహకులు కళాకృష్ట తెలిపారు. అనంతరం కళాబందు బిరుదు గ్రహీత గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారు ఈ బిరుదు అందించడం గర్వంగా ఉందన్నారు.

నిరంతరం కళాకారుల శ్రేయస్సు కోసం తాను ఎల్లప్పుడూ తోడ్పడతా నని, తనకు క్రీడలు అంటే మక్కువ అని, క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కళా కృష్ణ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సామాజిక సేవకులు ఈగ మల్లేశం, ప్రముఖ హాస్య నరుడు ఆర్ఎస్ నంద, పి వీ మదన్ మోహన్ రావు, జడల శివ, పొడిశెట్టి విష్ణువర్ధన్, గోకారపు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు