ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంపల్లి వాసికి పీహెచ్డీ
మునుగోడు,(విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) నుంచి కొంపల్లి గ్రామానికి చెందిన చేపూరి శామ్యూల్ పీహెచ్డీ డిగ్రీ అందుకున్నారు. సెప్టెంబర్ 8, 2026న నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం(Department of Computer Science and Engineering)లో ఆయన ఈ డిగ్రీని స్వీకరించారు.“డీప్ లెర్నింగ్ నమూనాలు, సమగ్ర సిఫార్సులను ఉపయోగించి, మెరుగైన పత్తి ఆకు వ్యాధి గుర్తింపు, నిర్వహణ కోసం ఒక విధానం” అనే అంశంపై శామ్యూల్ చేపూరి పరిశోధన చేశారు. పత్తి పంటలో ఆకు వ్యాధులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డీప్ లెర్నింగ్ నమూనాల సహాయంతో గుర్తించి, వాటి నిర్వహణకు మెరుగైన విధానాలను రూపొందించే దిశగా ఆయన పరిశోధన సాగింది.కొంపల్లి గ్రామానికి చెందిన చేపూరి లక్ష్మయ్య–కోటమ్మ దంపతుల కుమారుడైన శామ్యూల్ ఈ ఘనత సాధించడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.