పోరాట స్ఫూర్తికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ

27-09-2026 | 08:36pm

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌ గౌడ్‌

మెదక్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి) : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ(Konda Laxman Bapuji) త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌ గౌడ్‌(Mallikarjun Goud) అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌(BRS) ఆధ్వర్యంలో పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ సమీపంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మల్లికార్జున్‌ గౌడ్‌, పట్టణ పార్టీ కన్వీనర్‌, కౌన్సిలర్‌ మామిండ్ల ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితాంతం పోరాడారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన గొప్ప తెలంగాణవాది అని కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం(Telangana Horticultural University) ఏర్పాటు చేయడం ఆయన ప్రజాసేవకు దక్కిన గౌరవానికి నిదర్శనమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు మాయ మల్లేశం,బీమారి కిషోర్‌,ఆర్కే శ్రీనివాస్‌,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగా నరేందర్‌, నాయకులు లింగా రెడ్డి, తుమ్మ. లక్ష్మీనారాయణ,గంగారాం, అరుణ్‌,వర్షిత్‌, పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు