అసమాన త్యాగాలకు ప్రతిరూపం కొండా లక్ష్మణ్ బాపూజీ

27-09-2026 | 07:29pm

బీసీ నేత ధనుంజయ నాయుడు ఘన నివాళి 

నేరేడుచర్ల, సెప్టెంబర్27(విజయ క్రాంతి): అసమాన త్యాగాలకు ప్రతిరూపం కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు(Dhulipala Dhanunjaya Naidu) వ్యాఖ్యానించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా(Suryapet District) నేరేడుచర్ల ప్రధాన కూడలిలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమాన్ని(Birth anniversary event) పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా.... ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం,... పద్మశాలి సంఘం జిల్లా నాయకులు పిల్లల మర్రి పుల్లారావు,గుర్రం మార్కండేయ లతో కలిసి మాట్లాడుతూ...నాడు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అతిపిన్న వయస్సులోనే పాల్గొని జైలు శిక్ష అనుభవించి ఆ తరువాత తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన(Achievement of Telangana State) ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం గడ్డి పోచలాగా తిరస్కరించి ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అనేక త్యాగాలు చేసి మలిదశ ఉద్యమంలో కూడా తన ఇంటిని జలదృశ్యంలో తెలంగాణ ఉద్యమ కేంద్రంగా మలచి అనేక ఉద్యమాలకు ఊపిరిలూది ఢిల్లీ నగరంలో గడ్డకట్టే చలిలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని అశువులు బాసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు 

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి కొరకు తనయావత్ జీవితం అంకితం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముశం నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ నక్క రాంబాబు యరమాద శేఖర్ చంద్రమౌళి బెల్లంకొండ రాములు నక్క శ్రీనివాస్ , రాపోలు మహేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు