5 September, 2026 | 2:08 PM

ఎల్లారెడ్డిలో కొరివి కృష్ణా స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

05-09-2026 | 12:52pm
ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 4 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణ కేంద్రంలోని ముదిరాజ్‌ సంఘ భవనంలో శుక్రవారం ముదిరాజ్‌ సంఘ(Mudiraj Association) సభ్యులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ జయంతి వేడుకలను ఎల్లారెడ్డి ముదిరాజ్‌ మండల అధ్యక్షులు ప్యాలాల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్‌ ముదిరాజ్‌(Battu Vittal Mudiraj) మాట్లాడుతూ.. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ 133వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ముదిరాజ్‌, మండల అధ్యక్షులు ప్యాలాల రాములు, పట్టణ అధ్యక్షులు కోర్న నారాయణ, ఉపాధ్యక్షులు నిల సిద్దిరాములు, మర్రి ప్రకాష్‌, మర్రి బాలకిషన్‌, జక్కుల సంతోష్‌, జక్కుల అశోక్‌, మాజీ సర్పంచ్‌ బాలయ్య, మాజీ సర్పంచ్‌ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ సంతోష్‌, జనముల పోచయ్య, నిజ్జన మహేందర్‌, కె.బి. రాజు, గగన్‌, మర్రి సత్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు