కాంగ్ నినో వల్లే కరెంట్ కోతలు

23-09-2026 | 03:00pm

హైదరాబాద్: మా హయాంలో విద్యుత్ వ్యవస్థ(Electrical system) చాలా అద్భుతంగా నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని గతంలోనే చెప్పామని, అదే జరుగుతోందని, కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు ఉన్నాయని అన్ని పత్రికలు కథనాలు రాశాయని, ఏ సబ్ స్టేషన్ లో చూసినా 6 గంటలకు మించి కరెంట్ ఉండట్లేదని ఆయన తెలిపారు. 

20 వేల వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేశామని, కరెంటు ఇవ్వట్లేదని అడిగితే ఎల్ నినో(El Nino) అంటున్నారని, ఎల్ నినో వల్ల రాలేదు కాంగ్ నినో వల్లే కరెంట్ కోతలు ఏర్పాడుతున్నాయని కేటీఆర్ చెప్పారు. బెన్ కోకు నాసిరకం బొగ్గు అని మంత్రి వివేక్ కు చెందిన పత్రికలో రాశారని, బెన్ కోలో బొగ్గు నిల్వలు లేవని, సింగరేణి(Singareni)లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని కేటఆర్ ఆరోపించారు. 


మరిన్ని వార్తలు