డాక్టరేట్ పట్టా అందుకున్న ప్రవళిక

11-09-2026 | 08:48pm

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): కరీంనగర్ లక్ష్మీ నగర్ కు చెందిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ముత్యం వార్ ప్రవళిక(Lecturer Mutyam War Pravalika) హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుండి డాక్టర్ పట్టాను అందుకున్నారు, యూనివర్సిటీ నిర్వహించిన 85వ స్నాత కోత్సవంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల(Governor Shiv Pratap Shukla) ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, కుమార్ మొగిలి కరణ్, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు ఎం.కృష్ణ ఎల్లా చేతుల మీదుగా ఆమె డాక్టరేట్  అందుకున్నారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ హిందీ విభాగం నుంచి ఓం ప్రకాష్ వాల్మీకి ఔర్ బాబురావు బాగ్ లోకి కహానియా మే అభి వ్యక్త దళిత్ చేతనాక్ తులానాత్మక అధ్యాయన్ అనే అంశంపై ప్రొఫెసర్, చంద్రముఖర్జీ పర్యవేక్షణలో 2025వ సంవత్సరంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. టీజీపీఎస్ ద్వారా గత సంవత్సరంలో జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం మానకొండూరు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ అందుకున్న ప్రవళికను, తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, లింగా నాయక్, జిల్లా అధ్యక్షులు శా మారావు, మానకొండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు అధ్యాపకులు, అశ్విత, సునీత, టీఎస్ యుటిఎఫ్ నాయకులు.. వీ .శాంతి కుమారి. కుటుంబ సభ్యులు.  వరముని, అభిలాష్, శ్రీనివాస్, శాన్విక, యశశ్విక, సతీష్ సంతోష్ తదితరులు అభినందనలు తెలిపారు

మరిన్ని వార్తలు