రేపటి నుంచి శాసనసభ
- సజావుగా జరిగేలా సహకరించాలి
- సన్నాహక సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- మండలి చైర్మన్ గుత్తా, మంత్రి శ్రీధర్‌బాబు హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఈనెల 7వ తేదీ నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Monsoon Assembly sessions,) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం శాసన పరిషత్ సమావేశం(Legislative Council meetings) నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukhender Reddy), శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu), డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, కౌన్సిల్ చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసన పరిషత్ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, శాసనసభ కా ర్యదర్శి రేండ్ల తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పోలీసు లు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్పీకర్ మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారా న్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు. సభ్యులకు అందించే మెటీరియల్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ముందస్తుగా సమర్పిస్తే, సభ్యులు చదువుకుని సమావేశాలకు హాజరవుతారన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి సమావేశాలు హా ట్‌హాట్‌గా జరిగే అవకాశం ఉందని, పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చైర్మన్, స్పీకర్ సూచనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఒకరోజు ముందే సంబంధిత ప్రశ్నలకు జవాబులు అందజేయాలని, ఉభయ సభల సమావేశాల సమ యంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా మన్నారు. ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్ధతకు ఉభయ సభల సమావేశాలు నిదర్శనమని, అందుకే పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.






