మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

13-09-2026 | 05:15am

ఖమ్మం, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): ఖమ్మం పట్టణం శ్రీనివాస్‌నగర్‌లోని గీతాంజలి పాఠశాల (Geetanjali School) విద్యార్థులు మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని నినదిస్తూ శనివారం ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు మట్టి గణనాథులతో ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం రోజు మట్టితో తయారు చేసిన గణనాథుని పూజించాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వాడడం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్స్ టి పద్మ, టి అరుణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు