6 September, 2026 | 9:51 AM

పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం

06-09-2026 | 05:20am

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పట్టణాలలో, గ్రామాల్లో(villages) పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు(alcohol sales) జరుగుతున్నాయి. కిరాణా దుకాణం(grocery stores) నుంచి మొదలుకొని నివాసగృహాలు(residential homes), పాన్ షాపులు(Pan shops), కల్లు కాంపౌండ్ల వరకు అన్ని చోట్ల మద్యం లభిస్తున్నది. గతంలో వైన్ షాపుల(wine shops) పరిసరాలలో కొనసాగిన ఈ దందా ప్రస్తుతం గల్లీ గల్లీకి విస్తరించింది. దీంతో మద్యం ప్రియులు ఉదయం టీ, కాఫీలకు బదులుగా మద్యం తాగుతున్నారు.

కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉదయం పూట వాహనాలలో తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుడుంబా విక్రయాలు మానేసిన వారికి ప్రభుత్వం ఓవైపు స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలు పల్లెలు, పట్టణ ప్రజలను మత్తులో ముంచుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు.

ఒకప్పుడు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగుతోంది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్టు దుకాణాలు జోరందుకున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతున్నది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలోనే మద్యం షాపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది.

అందులో బాటిళ్లను ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. యువత మద్యానికి బానిసగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలి. 

 కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, 9848445134

మరిన్ని వార్తలు