అక్షరాస్యతతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

27-09-2026 | 05:26pm

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి 

సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య 

చల్లగరిగలో ఘనంగా అమ్మకు అక్షర మాల కార్యక్రమం

భూపాలపల్లి /చిట్యాల : అక్షరాస్యత(Literacy) మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చిట్యాల మండలం చల్లగరిగ గ్రామ సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య(Siripelli Jampaiah) అన్నారు. గ్రామంలో ఆదివారం వివోఏల ఆధ్వర్యంలో ‘అమ్మకు అక్షర మాల’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు(Government Schemes), హక్కులు, బాధ్యతలపై అవగాహన పొందేందుకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సెర్ప్

ఏపీఎం కోటేశ్వర్ రావు మాట్లాడుతూ 

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్యను చేరువ చేయడంలో స్వయం సహాయక సంఘాలు, వివోఏలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మహిళలు చదువుకోవడం ద్వారా తమ పిల్లల విద్యపై కూడా మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుందని, తద్వారా కుటుంబంలో విద్యా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెర్ప్ సీసీ సాంబశివుడు, రిటైర్డ్ టీచర్ బండి రాజమౌళి, వార్డు సభ్యురాలు మూల మంజుల తిరుపతి, ఎఫ్ఎల్ సీఆర్పీలు సుమలత, సమత, నాగలక్ష్మి, వివోఏలు రుక్మాబాయి, అనిత, శ్వేత, గీత, దేవిక గ్రామంలోని వివో ఓబీలు, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు