ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
23-09-2026 | 04:08pm
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బండగల్లిలో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి(Friends Youth Ganesh Council) ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదానం(Maha Annadanam) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది సంవత్సరాలుగా గణనాథుడి ఆశీస్సులతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గొల్ల చందు మాట్లాడుతూ... గణేష్ నవరాత్రుల(Ganesh Navratri) సందర్భంగా భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా మహా అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. నిర్వాహకులు బబ్బి, దుర్గాప్రసాద్, బన్నీ, బ్రహ్మం చారి, మణికంఠ,రాహుల్, శ్రీకాంత్,చింటూ, శివ యాదవ్ భక్తులు పాల్గొన్నారు.