విజయ్‌తో సినిమా.. త్రిష మెసేజ్ ఆశ్చర్యపోయా!

09-09-2026 | 05:20am

దళపతి విజయ్ సినిమాలో తాను కథానాయికగా ఎంపికైనప్పుడు త్రిష చేసిన మెసేజ్ చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపింది మళయాల యువ కథానాయిక మాళవికా మోహనన్(Malavika Mohanan). తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్.. త్రిష(Trisha)తో తనకున్న పాత జ్ఞాపకాలను పంచుకుంది. “రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘పేట’ సినిమాలో త్రిషతో కలిసి నేను కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. ఆ సమయంలో నేను ఇండస్ట్రీకి పూర్తి కొత్త. కానీ, అంత పెద్ద స్టార్ అయిన త్రిష నన్ను ఎంతగానో ఆదరించారు.

లంచ్ సమయాల్లో నన్ను కూడా గ్రూప్‌లో భాగస్వామిని చేస్తూ, ఎంతో సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారు. ‘పేట’ చిత్రం తర్వాత దళపతి విజయ్ సరసన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మాస్టర్’ (2021)లో నాకు హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఈ భారీ అవకాశం లభించిందని తెలియగానే, త్రిష స్వయంగా నాకు మెసేజ్ పంపి ప్రత్యేకంగా అభినందించారు. ‘హే బేబ్, నీకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, కంగ్రాచ్యులేషన్స్’ అంటూ త్రిష పంపిన మెసేజ్ నన్ను ఆశ్చర్యపరిచింది. తోటి నటీమణుల ఎదుగుదలను చూసి సంతోషపడే గుణం త్రిషకు మాత్రమే ఉంది, ఆమెది చాలా గొప్ప మనసు. కెరీర్ కీలక మలుపు తిరిగే సమయంలో త్రిష ఇచ్చిన ప్రోత్సా హం నాకెంతో ప్రత్యేకం” అని తెలిపింది. 

మరిన్ని వార్తలు