అనుమానాస్పద స్థితిలో వ్యక్తి దారుణ హత్య.!

10-09-2026 | 06:23pm

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి దారుణ హత్య(murdered)కు గురైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామానికి చెందిన ఎండి కరీం పాషా (40) జిల్లా కేంద్రంలోని రాం నగర్ కాలనీలోని స్వంత ఇంట్లో నివాసం ఉంటూ నాగం జనార్దన్ రెడ్డి హాస్పిటల్ పక్కన హోటల్ నడుపుతున్నాడు. గత 30 ఏళ్ల క్రితం కోడేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన సలీమా బేగంతో వివాహం జరిగింది.

వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా గురువారం మధ్యాహ్నం తన సొంత ఇంట్లోని మొదటి అంతస్థులో రక్తపు మడుగులో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వార్డ్ బృందాలతో తనిఖీలు జరిపారు. ప్రస్తుతం భార్య సలీమా బేగం తన పిల్లలతో పాటే దైవదర్శనం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో రక్తపు మడుగులో భర్త అండగ ఇంటి బయట నుంచి తాళం వేసి ఉండడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివాహేత్ర సంబంధాలా లేక ఆర్థిక పరమైన వ్యవహారాల్లో హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు