బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

10-09-2026 | 08:05pm

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్‌ మండల కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ నాకులను ముందస్తుగా జాగ్రత్తగా సిర్గాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ...అసెంబ్లీ ముట్టడికి పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను బీఆర్‌ఎస్ నాయకులు ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని అన్నారు.

మరిన్ని వార్తలు