కూలీ పనికి వెళ్లి వ్యక్తి అదృశ్యం

23-09-2026 | 03:39pm

​నర్సాపూర్: కూలీ పని కోసం ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన(Man missing) సంఘటన మెదక్ జిల్లా(Medak District) నర్సాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. ​పోలీసుల వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని 4వ వార్డుకు చెందిన దేగావత్ రవి (42) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న ఉదయం 8 గంటలకు స్థానిక లేబర్ అడ్డా వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు.

రాత్రి 7 గంటలైనా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన ఫోన్‌కు (9000647881) సంప్రదించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడి భార్య బుజ్జి నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ​ఆనవాళ్లు: బాధితుడు 5.5 అడుగుల ఎత్తు, గోధుమ రంగు చర్మం, గుండ్రటి ముఖం కలిగి ఉంటాడు. ఆకుపచ్చ, పసుపు రంగు గీతల షర్ట్ ధరించి ఉన్నాడు. తెలుగు, హిందీ, లంబాడీ భాషలు మాట్లాడగలడు. సమాచారం తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు