లవ్ బ్రేకప్.. సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్య

09-09-2026 | 11:41am

ధర్పల్లి : నిజామాబాద్ జిల్లాలో(Nizamabad district) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని(love breakup) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్పల్లి మండలం మరియా తండాలో ఈ ఘటన చోటుచేసుంది. సెల్ఫీ వీడియో(Selfie video) తీస్తూ పురుగుల మందు తాగి విజయ్ ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమించిన యువతి మరో పెళ్లికి సిద్ధమైందని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు